Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

*డా. బి. ఆర్.అంబేద్కర్ గారి భవన నిర్మాణం కొరకు కేటాయించిన స్థలములో మున్సిపాలిటీ వారు ఈ స్థలము మున్సిపాలిటీకి చెందినది అని పాతి పెట్టిన బోర్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*డా. బి. ఆర్.అంబేద్కర్ గారి భవన నిర్మాణం కొరకు కేటాయించిన స్థలములో మున్సిపాలిటీ వారు ఈ స్థలము మున్సిపాలిటీకి చెందినది అని పాతి పెట్టిన బోర్డు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి కర్నూల్ జిల్లా ఆగస్టు *తేదీ:18-08-2025* , *ఎమ్మిగనూరు* .
  • *డా.
  • బి.

పున్నమి ప్రతినిధి కర్నూల్ జిల్లా ఆగస్టు
*తేదీ:18-08-2025* ,
*ఎమ్మిగనూరు* .

*డా. బి. ఆర్.అంబేద్కర్ గారి భవన నిర్మాణం కొరకు కేటాయించిన స్థలములో మున్సిపాలిటీ వారు ఈ స్థలము మున్సిపాలిటీకి చెందినది అని పాతి పెట్టిన బోర్డును తొలగించాలని మరియు ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు ఉన్నటువంటి సచివాలయమును తొలగించి ఎస్సీ కమ్యూనిటీ ప్రజల ఉపయోగ కొరకు అప్పగించాలని, యెమ్మిగనూరు లెదర్ సొసైటీ లో వర్కర్స్ కు జరిగిన అన్యాయం పై CBI ఎంక్వయిరీ వేయాలని,PGRS లో DRO గారికి వినతిపత్రం* *అందజేత*.

ఎమ్మిగనూరు పట్టణమునందుగల ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరియు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం కు సంబంధించి BCRF ( బహుజన సివిల్ రైట్స్ ఫోరం ) సభ్యులు మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో DRO గారిని కలిసి సమస్యలను పరిష్కరించాలని కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం అయినది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు కేటాయించినటువంటి స్థలములో మున్సిపాలిటీ వారు ఉంచినటువంటి బోర్డును వెంటనే తొలగించి, భవన నిర్మాణం కొరకు కేటాయించినటువంటి స్థలమును సర్వేర్ ద్వారా కొలిపించి హద్దులు చూపించి ప్రహరి గోడను నిర్మించి భవన నిర్మాణం కొరకు కేటాయించిన 60 లక్షల రూపాయల బడ్జెట్ను సద్వినియోగ పరచి భవన నిర్మాణాన్ని చేపట్టాలని, మరియు ఎస్సీ కమ్యూనిటీకి గత 30 సంవత్సరముల క్రితం కేటాయించబడినటువంటి కమ్యూనిటీ హాల్ లో నిర్వహించబడుతున్న సచివాలయాలను తొలగించి ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు వివిధ కార్యక్రమాలను నిర్వహించుకొనుటకు కమ్యూనిటీ ప్రజలకు హాల్ ను అప్పగించాలని,లెదర్ సొసైటీ లో వర్కర్స్ కు జరిగిన అన్యాయం పై CBI ఎంక్వయిరీ చేయాలనీ అధికారులకు తెలియజేశారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందించి త్వరితగతిన సమస్య పరిష్కారం కొరకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన నిర్మాణ ఐక్య కార్యచరణ సభ్యులు బి సి ఆర్ ఎఫ్ ప్రతినిధులు k. సునీల్ కుమార్, పల్లవి దిలీప్ కుమార్, AP MRPS నాయకులు పార్లపల్లి జయన్న, జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు జడ రవి, ముత్తు సుమాల, సోగునూర్ ప్రశాంత్ కుమార్,నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు చార్లెస్, కడివేళ్ల రాజశేఖర్ తదితరులు వారు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *