Thursday, 3 September 2026
  • Home  
  • 22ఏపై కలెక్టరేట్ ముట్టడి: హరీశ్ రావు
- సంగారెడ్డి

22ఏపై కలెక్టరేట్ ముట్టడి: హరీశ్ రావు

పటాన్‌చెరు నియోజకవర్గంలో లక్ష ఇళ్లు, 50 వేల ఎకరాలను 22ఏ జాబితాలో చేర్చడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి ఆస్తులను దరఖాస్తులు లేకుండానే తొలగించారని ప్రశ్నించారు. 30–40 ఏళ్లుగా నివసిస్తున్న వారిని కబ్జాదారులుగా ముద్రవేయడం అన్యాయమన్నారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించి, 22ఏ తొలగించే వరకు అక్కడే వంటావార్పు చేపడతామని హెచ్చరించారు. ఈ వ్యవహారంతో ముఖ్యమంత్రికి సంబంధం లేకుంటే మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.