నంద్యాల: స్థానిక ఎస్పీజీ హైస్కూల్ మైదానంలో హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘హాకీ మాంత్రికుడు’ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యరాజు, జాయింట్ సెక్రటరీ జెడ్.ఎస్.పి. దివాకర్, పాఠశాల హెచ్ఎం నళిని ముఖ్యఅతిథులుగా హాజరై ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇటీవల జాతీయ స్థాయి హాకీ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులు మిద్దె శిశిర గ్రేస్, జెరూషా క్రిష్టియా, భార్గవిలతో పాటు వెటరన్ క్రీడాకారుడు శిరవెళ్ల విల్సన్‌ను జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఫోటో క్యాప్షన్: మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు, హెచ్ఎం నళిని, క్రీడాకారులు.

ఘనంగా మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం క్రీడాకారులను సన్మానించిన హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు
నంద్యాల: స్థానిక ఎస్పీజీ హైస్కూల్ మైదానంలో హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘హాకీ మాంత్రికుడు’ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యరాజు, జాయింట్ సెక్రటరీ జెడ్.ఎస్.పి. దివాకర్, పాఠశాల హెచ్ఎం నళిని ముఖ్యఅతిథులుగా హాజరై ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల జాతీయ స్థాయి హాకీ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులు మిద్దె శిశిర గ్రేస్, జెరూషా క్రిష్టియా, భార్గవిలతో పాటు వెటరన్ క్రీడాకారుడు శిరవెళ్ల విల్సన్‌ను జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఫోటో క్యాప్షన్: మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న హాకీ ఏపీ అధ్యక్షుడు చాణక్యరాజు, హెచ్ఎం నళిని, క్రీడాకారులు.

