తొట్టంబేడు, మే 24, (పున్నమి న్యూస్): తొట్టంబేడు పంచాయతీ పరిధిలోని బీడీ కాలనీలో గత కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న స్థానిక కూటమి నాయకులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. తొట్టంబేడు మండల సింగిల్ విండో బ్యాంకు చైర్మన్ భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో దెబ్బతిన్న తాగునీటి పైప్‌లైన్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. గుంతలు తవ్వి, పాత పైపులను తొలగించి కొత్త పైపులను అమర్చుతూ నీటి సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేశారు. వేసవి కాలంలో తీవ్రంగా వేధించిన తాగునీటి సమస్యను గుర్తించి సకాలంలో స్పందించిన కూటమి నాయకులకు బీడీ కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నాయకులు చూపిన చొరవ అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

బీడీ కాలనీలో తాగునీటి సమస్యకు చెక్