Tuesday, 18 August 2026
  • Home  
  • టీడీపీ ‘2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీ ‘2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమం

ఆత్మకూరు, ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ‘టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమాన్ని ఆత్మకూరు రూరల్ మండలం నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలోని బూత్ నంబర్ 118లో సోమవారం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు, ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి డా. తూమాటి శశిధర్‌రెడ్డి, నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు కేతా విజయభాస్కర్‌రెడ్డి, మండల యూనిట్ ఇన్‌చార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి సూచనలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రచార కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నువ్వూరుపాడు పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి, బూత్ కన్వీనర్ షేక్ రియాజ్, యువ కార్యకర్త రావిళ్ల శ్రీనుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు చేరవేశారు.

ఆత్మకూరు, ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ‘టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమాన్ని ఆత్మకూరు రూరల్ మండలం నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలోని బూత్ నంబర్ 118లో సోమవారం నిర్వహించారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు, ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి డా. తూమాటి శశిధర్‌రెడ్డి, నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు కేతా విజయభాస్కర్‌రెడ్డి, మండల యూనిట్ ఇన్‌చార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి సూచనలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రచార కరపత్రాలను ప్రజలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నువ్వూరుపాడు పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి, బూత్ కన్వీనర్ షేక్ రియాజ్, యువ కార్యకర్త రావిళ్ల శ్రీనుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు చేరవేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.