వరంగల్‌ను ప్రత్యేక రీజియన్‌గా ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్‌రావుకు వినతి
మెదక్: వరంగల్‌ను ప్రత్యేక రీజియన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి లేఖ అందించిన ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్‌రావు గారిని ఈ రోజు మెదక్‌లో BPEF Medak & Telangana ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా సిద్దిపేటను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు, మెదక్ డివిజన్‌ను హైదరాబాద్ హెడ్‌క్వార్టర్ రీజియన్‌లోనే కొనసాగించాలని కోరుతూ ఎంపీ రఘునందన్‌రావు గారికి వినతిపత్రం సమర్పించారు.
పోస్టల్ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వరంగల్‌ను ప్రత్యేక రీజియన్‌గా ఏర్పాటు చేయడం, సిద్దిపేట కొత్త డివిజన్ ఏర్పాటు, మెదక్ డివిజన్‌ను హైదరాబాద్ హెడ్‌క్వార్టర్ రీజియన్‌లో కొనసాగించడం వల్ల ఉద్యోగులకు పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని ప్రతినిధులు వివరించారు.
ఈ కార్యక్రమంలో BPEA గ్రూప్-C, పోస్టుమెన్, GDS సెక్రటరీలు, BPEF నాయకులు మరియు యాక్టివ్ మెంబర్స్ పాల్గొన్నారు.


