మనుబోలు 20-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్ )రెడ్ జోన్ పరిధిలోనిమనుబోలుగ్రామప్రజలకునిత్యావసరాలుకు సంభందించి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్టు మనుబోలు తహశీల్దార్ ఆనందరావు గారు తేలియచేసినారు. ఈ రోజు తహసీల్దార్ కార్యాలయంలోఎంపీడీవో వెంకటేశ్వర్లు ,ఎస్సై సూర్య ప్రకాశ్ రెడ్డి మనుబోలు పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ మరియు మనుబోలు గ్రామ నాయకులతో తహశీల్దార్ ఆనంద రావు గారి ఆధ్వర్యంలో జరగిన సమావేశంలో సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నారు .మనుబోలు గ్రామంలో బిసి కాలనీలో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు కాబడినది అందువల్ల మనుబోలు గ్రామ ప్రజలు బహిరంగ ప్రదేశాలలో తిరగడం నిషేధించడం జరిగిందని తెలిపారు .మనుబోలు గ్రామ ప్రజలకు నిత్యావసరాలకు సంబంధించి డోర్ డెలివరీ చేయుటకు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు చర్యలు చేపట్టినట్లు తహశీల్దార్ ఆనందరావు తెలియచేసినారు. కోవిడ్- 19 నిత్యావసర వస్తువుల హెల్ప్ డెస్క్ no 9154636573 మనుబోలు మండలం