సీతారామపురం జడ్పీహెచ్ పాఠశాలలో 1993 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సహకారంతో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఎంఈఓ మస్తాన్వలి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాజ్యాంగం, సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ), బాలల హక్కులు, విద్యా హక్కు, వినియోగదారుల చట్టానికి సంబంధించిన పుస్తకాలను పాఠశాలకు అందజేశారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే రాజ్యాంగం, చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పుస్తక పఠనంతో విద్యార్థుల్లో విజ్ఞానం, సామాజిక బాధ్యత పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ-2 ప్రవీణతో పాటు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

సీతారామపురం జడ్పీ పాఠశాలలో నూతన గ్రంథాలయం ప్రారంభం