సీతారామపురం మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ ఘుటిక సిద్ధేశ్వర ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం నాగపంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇష్టకామేశ్వరి అమ్మవారిని వివిధ రకాల పలహారాలతో ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచే పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నాగపంచమి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

ఘుటిక సిద్ధేశ్వరంలో ఘనంగా నాగపంచమి వేడుకలు