వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల : శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈనెల 21న నంద్యాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.
- శ్రీనివాసరెడ్డి తెలిపారు.
- నంద్యాల వాస్తవ్యులు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు, దంపతులు పాల్గొనాలని కోరారు.
నంద్యాల : శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈనెల 21న నంద్యాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి తెలిపారు. నంద్యాల వాస్తవ్యులు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు, దంపతులు పాల్గొనాలని కోరారు. పాల్గొనే వారికి అవసరమైన పూజా ద్రవ్యాలతో పాటు దేవస్థానం తరఫున ముత్తైదువాయనం అందజేస్తామని తెలిపారు.వ్రతంలో పాల్గొనదలచిన వారు ఉదయం 10.30 గంటలకు ఆలయం లోపల ఉండాలని సూచించారు.