*విద్యుత్ ఘాతానికి ప్రైవేట్ లైన్ మాన్ మృతి*
*దొరవారిసత్రo సెప్టెంబరు04*
దొరవారి సత్రం
విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన శుక్రవారం దొరవారిసత్రం మండల పరిధిలోని పాలెం పాడు గ్రామంలో జరిగింది.
ఆ గ్రామ దళిత వాడలో ఉన్న విద్యుత్ స్తంభం పై ఎక్కి సమస్య సరిచేయాలని నిమిత్తంతో
ప్రైవేటు లైన్మెన్ గా పనిచేస్తున్న దొడ్డి గుంటకయ్య (సురేష్36) విద్యుత్ ఘాతానికి బలై తీగలపైనే పడి మృతి చెందాడు. గుంటకయ్య ఎక్కిన త్రీ ఫేస్ స్తంభానికి ఇటు దళిత వాడలోని ట్రాన్స్ఫార్మర్, అటు బీసీ కాలనీలోని ట్రాన్స్ఫార్మర్ల విద్యుత్ సరఫరా జరుగుతుంది అని అక్కడి ప్రజలు అంటున్నారు. ఓవైపు మాత్రమే ట్రాన్స్ఫార్మర్ ఆపి
స్తంభంపై ఎక్కడంతోనే విద్యుత్ ప్రమాద బారిన పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఈ సంఘటన చూసినవారు అంటున్నారు.
ఏది ఏమైనా ఆ గ్రామానికి సంబంధించిన డిపార్ట్మెంట్ లైన్మెన్ ఆ సమయంలో అక్కడ లేకపోవడం, విద్యుత్ సరఫరా వంటి విషయాలు ప్రైవేట్ లైన్మెన్ కు తెలియకపోవడంతో ప్రమాద బారిన పడి ప్రాణాలు విడిచినట్లు అంటున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు సంఘటనలలో ప్రైవేటు లైన్మెన్లు ఎందరో బలి అవుతున్నా డిపార్ట్మెంట్ తప్పిదాలను సరి చేయడం లేదని విమర్శిస్తున్నారు. జీవనోపాధి కోసం ప్రైవేట్ లైన్ మెన్ గా పనిచేస్తూ మృతి చెందడంతో భార్య, పిల్లల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది.


