సత్యవేడు మండలం:
👉 సత్యవేడు మండలంలోని చిన్న ఈటిపాకం వద్ద రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. కట్టెలతో అధికంగా లోడ్ చేసిన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడగా, సమీపంలో ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నట్లు సమాచారం.
👉 ప్రమాద సమయంలో భారీగా కట్టెలు రోడ్డుపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
👉 అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది అధికారులు విచారణ అనంతరం స్పష్టత రావాల్సి ఉంది. ట్రాక్టర్‌లో పరిమితికి మించి కట్టెలను తరలించడం వల్లే ప్రమాదం జరిగిందా? లేక ఇతర కారణాల వల్ల వాహనం అదుపుతప్పిందా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.
👉 పరిమితికి మించి లోడ్‌తో వాహనాలు రోడ్డుపై ప్రయాణించడం ఎప్పటికైనా ప్రమాదకరమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఓవర్‌లోడ్ వాహనాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
👉 ఒక్క నిర్లక్ష్యం.. ఒక కుటుంబానికే కాదు, రోడ్డుపై ప్రయాణించే ఎంతోమంది ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంది.


