Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాడవాడలా ఉత్సాహంగా,ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వాడవాడలా ఉత్సాహంగా,ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వాడవాడలా కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు ఉత్సాహంగా,ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి,కృష్ణ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టేందుకు,కార్యక్రమాన్ని తిలకించేందుకు చిన్నపిల్లల మొదలు వృద్ధుల వరకు ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

కాకినాడ జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వాడవాడలా కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు ఉత్సాహంగా,ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి,కృష్ణ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టేందుకు,కార్యక్రమాన్ని తిలకించేందుకు చిన్నపిల్లల మొదలు వృద్ధుల వరకు ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. కృష్ణాష్టమి సందర్బంగా తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామంలో గల రాధాకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులతో పాటు ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గాడిమొగ గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచి కొక్కిలిగడ్డ లోకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *