జిల్లా కన్వీనర్‌గా రాథోడ్ రమేష్, కో-కన్వీనర్‌గా పాత్లె రాజు నియామకం
కొమురం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 29: యువత సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న విద్యార్థి నేస్తం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కమిటీ బాధ్యతలను ప్రకటించింది. కేరమెరి మండలం బోరిలాల్‌గూడ గ్రామానికి చెందిన రాథోడ్ రమేష్‌ను జిల్లా కన్వీనర్‌గా, కేరమెరి మండల కేంద్రానికి చెందిన పాత్లె రాజును జిల్లా కో-కన్వీనర్‌గా నియమించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ బద్దం పురుషోత్తం రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు విద్యార్థి నేస్తం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి. మురళి మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన జిల్లా కన్వీనర్ రాథోడ్ రమేష్, కో-కన్వీనర్ పాత్లె రాజు మాట్లాడుతూ, విద్యార్థి నేస్తం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యువత సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థగా, వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంస్థ జాతీయ స్థాయి సమావేశాలకు హాజరై, అక్కడ రూపొందించే కార్యాచరణకు అనుగుణంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
తమపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ విశ్వనాథ్, సి. గణేష్ (రిటైర్డ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఉస్మానియా యూనివర్సిటీ), జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి. మురళి మనోహర్లకు రాథోడ్ రమేష్, పాత్లె రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
– పున్నమి రిపోర్టర్


