Sunday, 30 August 2026
  • Home  
  • క్రీడా స్ఫూర్తితో కళకళలాడిన పల్లవి ఇంజినీరింగ్ కళాశాల, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
- రంగారెడ్డి

క్రీడా స్ఫూర్తితో కళకళలాడిన పల్లవి ఇంజినీరింగ్ కళాశాల, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

పున్నమి: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కుంట్లూర్‌లోని పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందించే లక్ష్యంతో వివిధ ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా పోటీలను నిర్వహించారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ మల్క కొమరయ్య వర్చువల్‌గా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మల్క నవీన్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి విద్యతో పాటు క్రీడలు, సాంకేతిక, సాంస్కృతిక, సహపాఠ్య కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అకాడమిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ ఎస్.జి.ఎస్. మూర్తి క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం, ఏకాగ్రత, సమయపాలన పెంపొందుతాయని తెలిపారు. మేనేజ్‌మెంట్ రిప్రజెంటేటివ్ శ్రీ బెరెల్లి కమలాకర్ రావు, ప్రిన్సిపాల్ డా. జె.బి.వి. సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆర్. ప్రశాంత్ కుమార్ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమాల సమన్వయంలో ధనుంజయ రావు కొడాలి, శ్రీ ఎ. సంతోష్, గురునాథం, సి.హెచ్. రంజిత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కుంట్లూర్‌లోని పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందించే లక్ష్యంతో వివిధ ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా పోటీలను నిర్వహించారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ మల్క కొమరయ్య వర్చువల్‌గా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మల్క నవీన్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి విద్యతో పాటు క్రీడలు, సాంకేతిక, సాంస్కృతిక, సహపాఠ్య కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అకాడమిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ ఎస్.జి.ఎస్. మూర్తి క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం, ఏకాగ్రత, సమయపాలన పెంపొందుతాయని తెలిపారు.

మేనేజ్‌మెంట్ రిప్రజెంటేటివ్ శ్రీ బెరెల్లి కమలాకర్ రావు, ప్రిన్సిపాల్ డా. జె.బి.వి. సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆర్. ప్రశాంత్ కుమార్ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమాల సమన్వయంలో ధనుంజయ రావు కొడాలి, శ్రీ ఎ. సంతోష్, గురునాథం, సి.హెచ్. రంజిత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.