రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసిన నరవ జనసేన పార్టీ సభ్యులు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న 88 వార్డ్ జనసేన పార్టీ అధ్యక్షులు వబ్బిన జనార్ధన్ శ్రీకాంత్.
88 వార్డ్ , పెందుర్తి నియోజకవర్గం, విశాఖపట్నం, పెద నరవ గ్రామంలో జనసేనాని, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మ దినోత్సవ సంబరాల్లో భాగంగా మొదటి రోజు నరవ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, అనంతరం ముఖ్య అతిథులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ కేక్ కట్ చేసి కళ్యాణ్ గారికి అభినందనలు తెలపడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గ్రామంలో అధ్యక్షులు జన్మదినాన్ని, జనసేన పార్టీ ఆవిర్భావం రోజు ఏదో ఒక సేవా మార్గం చేస్తూ ఉంటారని, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదిన సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ యొక్క కార్యక్రమంలో యువకులు పాల్గొని సుమారు 40 మంది రక్తాన్ని డొనేట్ చేశారని, రాజకీయ అంటే పదవులే కాదు సేవ చేయడం కూడా ఒక మార్గమని మా నాయకుడు ఎప్పుడూ చెబుతూ ఉంటారని, ఇలాంటి పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అధ్యక్షులు వారికి ఇవ్వాలని కోరుకోవడం జరిగింది, లింగం వాసు గారు మాట్లాడుతూ నరవ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని దానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు, ఈ యొక్క కార్యక్రమంలో ప్రవీణ్, శివ, నవీన్, అశోక్, శ్రీను, బొబ్బరి శ్రీను, మరియు జనసైనికులు ప్రజలు పాల్గొన్నారు.
Uploaded Video:



