విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గీతం ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రవితేజ రేగులగడ్డ తెలిపారు.
జనసేన పార్టీ 8వ వార్డు అధ్యక్షులు శాఖరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని సెప్టెంబర్ 2న ఎండాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులచే ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఈ సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని శిబిరానికి హాజరై తమ నేత్రాలను ఉచితంగా పరీక్షించుకోవాలని రవితేజ రేగు లగడ్డ గారు కోరారు.


