Sunday, 30 August 2026
  • Home  
  • నేడు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో పి జి ఆర్ ఎస్
- విజయనగరం 

నేడు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో పి జి ఆర్ ఎస్

*నేడు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పీజీఆర్‌ఎస్‌* *ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చు* *క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా పీజీఆర్‌ఎస్‌పై ఫిర్యాదు/అభిప్రాయాన్ని నమోదు చేసుకోవచ్చు* –జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 30: పున్నమి ప్రతినిధి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే ఉద్దేశంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నేడు ఆగస్టు 31 సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉదయం 10.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు, ఫిర్యాదులు, వినతులను పీజీఆర్‌ఎస్‌లో సమర్పించి సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకురావచ్చని కలెక్టర్‌ సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలకు ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. *క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా ఫిర్యాదులు, అభిప్రాయాలు* పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో తమకు అందిన సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్‌ను క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చని తెలిపారు. మొబైల్‌ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసిన అనంతరం తెరుచుకునే పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ పేజీలో అవసరమైన వివరాలను నమోదు చేసి తమ అభిప్రాయాన్ని/ఫిర్యాదును సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు హాజరై తమ సమస్యలను అధికారులకు తెలియజేయడంతో పాటు, అందుబాటులో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి కోరారు.

*నేడు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పీజీఆర్‌ఎస్‌*

*ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చు*

*క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా పీజీఆర్‌ఎస్‌పై ఫిర్యాదు/అభిప్రాయాన్ని నమోదు చేసుకోవచ్చు*

–జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 30: పున్నమి ప్రతినిధి

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే ఉద్దేశంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నేడు ఆగస్టు 31 సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉదయం 10.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి తెలిపారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు, ఫిర్యాదులు, వినతులను పీజీఆర్‌ఎస్‌లో సమర్పించి సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకురావచ్చని కలెక్టర్‌ సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలకు ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

*క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా ఫిర్యాదులు, అభిప్రాయాలు*

పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో తమకు అందిన సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్‌ను క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చని తెలిపారు.
మొబైల్‌ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసిన అనంతరం తెరుచుకునే పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ పేజీలో అవసరమైన వివరాలను నమోదు చేసి తమ అభిప్రాయాన్ని/ఫిర్యాదును సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రజలు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు హాజరై తమ సమస్యలను అధికారులకు తెలియజేయడంతో పాటు, అందుబాటులో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.