Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం,సంక్షేమం,అభివృద్ధి ఇంటింటా కార్యక్రమంలో పాల్గొన్న దాట్ల సుబ్బరాజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం,సంక్షేమం,అభివృద్ధి ఇంటింటా కార్యక్రమంలో పాల్గొన్న దాట్ల సుబ్బరాజు

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.
  • పోలవరం గ్రామంలో రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలన సందర్భంగా నిర్వహించిన నమ్మకంసంక్షేమం,అభివృద్ధి కార్యక్రమంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, నియోజకవర్గ సమన్వయకర్త సుంకర పావని, మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద,పెదమడి రాజేష్ , కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం గ్రామంలో రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలన సందర్భంగా నిర్వహించిన నమ్మకంసంక్షేమం,అభివృద్ధి కార్యక్రమంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, నియోజకవర్గ సమన్వయకర్త సుంకర పావని, మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద,పెదమడి రాజేష్ , కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంక్షేమం,అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగుతోందని అన్నారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాలుగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే, రానున్న రోజుల్లో ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.
ప్రజల సంక్షేమం, నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *