Monday, 24 August 2026
  • Home  
  • రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

పోలిరెడ్డిపాలెం రైల్వే స్టేషన్ సౌత్ యార్డ్లో ఆదివారం సాయంత్రం సుమారు 6:10 గంటల సమయంలో గుర్తుతెలియని యువకుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సిల్చార్ నుంచి తిరువనంతపురం వెళ్లే 15608 అరుణై సూపర్ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు. అతను నేలమరంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సూళ్లూరుపేట జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ ఘటనపై సూళ్లూరుపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కే. శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలిరెడ్డిపాలెం రైల్వే స్టేషన్ సౌత్ యార్డ్లో ఆదివారం సాయంత్రం సుమారు 6:10 గంటల సమయంలో గుర్తుతెలియని యువకుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సిల్చార్ నుంచి తిరువనంతపురం వెళ్లే 15608 అరుణై సూపర్ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు. అతను నేలమరంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

మృతుడి ఆచూకీ తెలిసిన వారు సూళ్లూరుపేట జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ ఘటనపై సూళ్లూరుపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కే. శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.