నెల్లిమర్ల: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం తుడెం గ్రామానికి చెందిన సుమారు 40 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి.
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
పార్టీలో చేరిన వారిలో నీలాపు రామచంద్రరెడ్డి, గాలి పోలిరెడ్డి, దువ్వు వెంకటరమణ తదితరులు తమ అనుచరులతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


