డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ:
దిండి–చించినాడ వంతెన ప్రజల కలల వంతెన. ఈ వంతెనపై నాణ్యమైన రహదారి నిర్మించి, అందమైన రంగులు వేసి, ఆధునికంగా తీర్చిదిద్దితే రాజోలు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ప్రస్తుతం వంతెనపై రహదారి పరిస్థితి ప్రజలకు అసౌకర్యంగా మారింది. వంతెన అందాన్ని పెంచేలా ఇరువైపులా ఆకర్షణీయమైన రంగులు, నాణ్యమైన ఫుట్‌పాత్‌లు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలి. పర్యాటకులను ఆకర్షించే విధంగా వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఇది కేవలం రహదారి మాత్రమే కాదు.. మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచే నిర్మాణం. పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వంతెనను సుందరీకరించి అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోయేలా దిండి–చించినాడ వంతెన రూపుదిద్దుకుంటుంది. ఈ అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

దిండి–చించినాడ వంతెనకు ఐకానిక్ రూపం కావాలి!
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ: దిండి–చించినాడ వంతెన ప్రజల కలల వంతెన. ఈ వంతెనపై నాణ్యమైన రహదారి నిర్మించి, అందమైన రంగులు వేసి, ఆధునికంగా తీర్చిదిద్దితే రాజోలు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ప్రస్తుతం వంతెనపై రహదారి పరిస్థితి ప్రజలకు అసౌకర్యంగా మారింది. వంతెన అందాన్ని పెంచేలా ఇరువైపులా ఆకర్షణీయమైన రంగులు, నాణ్యమైన ఫుట్‌పాత్‌లు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలి. పర్యాటకులను ఆకర్షించే విధంగా వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఇది కేవలం రహదారి మాత్రమే కాదు.. మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచే నిర్మాణం. పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వంతెనను సుందరీకరించి అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోయేలా దిండి–చించినాడ వంతెన రూపుదిద్దుకుంటుంది. ఈ అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

