ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తొలగించాలని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనను రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు తీవ్రంగా ఖండించారు.
రిజర్వేషన్లు తొలగించాలంటే ముందుగా కుల, మత వివక్షను పూర్తిగా నిర్మూలించాలని ఆయన అన్నారు.
భూమి, నీరు, సహజ వనరులను అన్ని వర్గాలకు సమానంగా పంచిన తర్వాత రిజర్వేషన్లపై చర్చించవచ్చని పేర్కొన్నారు.
నేటికీ దళితులు వివక్ష, అవమానాలు, దాడులను ఎదుర్కొంటున్నారని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులే వారికి రక్షణగా ఉన్నాయని తెలిపారు.
రిజర్వేషన్లపై అపోహలు, విద్వేషాలు రెచ్చగొడుతూ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

రిజర్వేషన్లు తొలగిస్తే ప్రళయం సృష్టిస్తాం
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తొలగించాలని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనను రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు తీవ్రంగా ఖండించారు. రిజర్వేషన్లు తొలగించాలంటే ముందుగా కుల, మత వివక్షను పూర్తిగా నిర్మూలించాలని ఆయన అన్నారు. భూమి, నీరు, సహజ వనరులను అన్ని వర్గాలకు సమానంగా పంచిన తర్వాత రిజర్వేషన్లపై చర్చించవచ్చని పేర్కొన్నారు. నేటికీ దళితులు వివక్ష, అవమానాలు, దాడులను ఎదుర్కొంటున్నారని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులే వారికి రక్షణగా ఉన్నాయని తెలిపారు. రిజర్వేషన్లపై అపోహలు, విద్వేషాలు రెచ్చగొడుతూ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

