UIDAI సూచనల ప్రకారం, పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత, మరోసారి 15 ఏళ్ల వయసులో తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) చేయించాలి. ఐదేళ్లలోపు ఆధార్ నమోదులో పిల్లల వివరాలు, ఫొటో మాత్రమే తీసుకుంటారు. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లను నమోదు చేయరు. ఐదేళ్లు పూర్తయ్యాక వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాలి. ఈ ప్రక్రియను గడువులోగా ఉచితంగా పూర్తి చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆధార్ రికార్డులు తాజాగా ఉండటం వల్ల స్కూల్ అడ్మిషన్లు, పరీక్షలు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాలు పొందేటప్పుడు గుర్తింపు ధృవీకరణ సులభమవుతుంది. 15 ఏళ్ల వయసులో మరోసారి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయడం ద్వారా ఆధార్ వివరాలు కచ్చితంగా ఉంటాయి. 12 అంకెల ఆధార్ నంబర్ దేశవ్యాప్తంగా ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతోంది.



