Sunday, 23 August 2026
  • Home  
  • జయహో బీసీ – స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
- కర్నూలు

జయహో బీసీ – స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు

కర్నూలు: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు మాత్రమే కల్పించిందని అన్నారు. బీసీలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, బీసీల సంక్షేమం, అభ్యున్నతి, రాజకీయ సాధికారత కోసం టీడీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని భాస్కర్ల చంద్రశేఖర్ అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం, సముచిత ప్రాధాన్యత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. — భాస్కర్ల చంద్రశేఖర్ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు

కర్నూలు: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు మాత్రమే కల్పించిందని అన్నారు. బీసీలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, బీసీల సంక్షేమం, అభ్యున్నతి, రాజకీయ సాధికారత కోసం టీడీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని భాస్కర్ల చంద్రశేఖర్ అన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

బీసీలకు సామాజిక న్యాయం, సముచిత ప్రాధాన్యత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

— భాస్కర్ల చంద్రశేఖర్
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.