నాగర్‌కర్నూల్: మహబూబ్‌నగర్‌లోని పల్లవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జజాల కృష్ణను నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న కృష్ణ ఆరోగ్య పరిస్థితిని ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్య సేవలుందించి త్వరగా కోలుకునేలా చూడాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు వసంత్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


