Thursday, 27 August 2026
  • Home  
  • మాతమ్మ తిరునాళ్లకు రూ.20 వేల ఆర్థిక సహాయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాతమ్మ తిరునాళ్లకు రూ.20 వేల ఆర్థిక సహాయం

ఆత్మకూరు, ఆగస్టు 27 (పున్నమి ప్రతినిధి): రేవూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించనున్న మాతమ్మ తిరునాళ్లకు డాక్టర్ వింజం దొరసనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు గురువారం హాస్పిటల్ ప్రాంగణంలోని తన చాంబర్‌లో శ్రీ మాతమ్మ దేవస్థానం కమిటీ పెద్దలకు ఆర్థిక సహాయాన్ని అందజేసి తిరునాళ్ల నిర్వహణకు తన వంతు సహకారం అందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించడంతో పాటు గ్రామీణ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందులో భాగంగానే రేవూరు గ్రామంలో నిర్వహించనున్న శ్రీ మాతమ్మ తిరునాళ్లకు ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు.తిరునాళ్ల నిర్వహణకు గ్రామస్తులు, దేవస్థానం కమిటీ సభ్యులు చేస్తున్న ఏర్పాట్లను అభినందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. డాక్టర్ వింజం దొరసనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలకు నిరంతరం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్ కుమార్, తోడేటి అశోక్, ఆది రహీం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.