మంగళగిరి: మంగళగిరికి చెందిన వాసవి అఖిల పవని మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL)లో రాయలసీమ జెన్ స్టార్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అఖిల పవని తన అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి మైదానంలో రాణించాలని, రాబోయే పోటీల్లో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షిస్తున్నారు.
మహిళల క్రికెట్‌లో ప్రతిభను చాటుకునేందుకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంగళగిరి, రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకురావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. WAPLలో పాల్గొంటున్న ప్రతిభావంతులైన క్రీడాకారిణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు.

మంగళగిరి యువ క్రికెటర్‌కు మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అవకాశం
మంగళగిరి: మంగళగిరికి చెందిన వాసవి అఖిల పవని మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL)లో రాయలసీమ జెన్ స్టార్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అఖిల పవని తన అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి మైదానంలో రాణించాలని, రాబోయే పోటీల్లో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షిస్తున్నారు. మహిళల క్రికెట్‌లో ప్రతిభను చాటుకునేందుకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంగళగిరి, రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకురావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. WAPLలో పాల్గొంటున్న ప్రతిభావంతులైన క్రీడాకారిణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు.

