పామూరు, సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి): మండలంలోని జంగాలపల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని యాదవ సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి, పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆకుపాటి వెంకటేష్‌ను యాదవ సోదరులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా యాదవ సోదరులు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేనికల చిన మాలకొండయ్య, శివకృష్ణ, చేనికల సురేష్, చెనికల మనోజ్, నాగేంద్ర, కంట కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కృష్ణా జన్మాష్టమి పూజల్లో పాల్గొన్న ఆకుపాటి వెంకటేష్