*తిరుమల క్షేత్ర వైభవాన్ని ప్రతిబింబించే నాలుగు ప్రత్యేక తపాలా కవర్లు విడుదల*
తిరుపతి,సెప్టెంబర్-02 పున్నమి ప్రతినిధి
తపాలా శాఖ తిరుపతి డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరు పెక్స్-2026 జిల్లాస్థాయి తపాలా బిళ్ళల ప్రదర్శన తిరుపతిలోని గొల్లవానికుంట సమీపంలో ఆయిల్ మిల్ రోడ్ లోని ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి తిరుపతి తిరుమల దేవస్థానం అదనపు కార్య నిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు కర్నూల్ పోస్టల్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ వెన్నెల ఉపేంద్ర , కర్నూల్ పోస్టల్ డివిజన్ రీజియన్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్ సుధాకర్ మాల్యా విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి చేతులు మీదుగా తిరుమల క్షేత్రానికి సంబందించిన ఆనంద నిలయం, జపాలి తీర్థం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగా తీర్థం లను నాలుగు ప్రత్యేక తపాల కవర్లను విడుదల చేశారు వీటికి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, ప్రముఖ ఫిలాటలిస్ట్ చంద్రశేఖర్ అదేవిధంగా గోశాల బాలపెంచలయ్య లు స్పాన్సర్లుగా వ్యవహరించారు ఈ ప్రత్యేక కవర్లను తిరుమల క్షేత్రం లోని ఆధ్యాత్మిక, చారిత్రాత్మక , సాంస్కృతిక వైభవాన్ని తపాల జ్ఞాపకాల రూపంలో చిరస్థాయిగా నిలుపుతాయి, ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారి వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఫిలాటెలీ అనేది కేవలం తపాలా బిల్లుల సేకరణే కాకుండా దేశ చరిత్ర, సాంస్కృతిక సాంప్రదాయాలు, అదేవిధంగా వారసత్వాన్ని తెలుసుకునే చక్కని మార్గమని పేర్కొన్నారు ముఖ్యంగా విద్యార్థుల్లో ఫిలాటెలీ పట్ల ఆసక్తిని పెంపొందించడం ద్వారా వారి జ్ఞానాన్ని సృజన సృజనాత్మకతను విస్తరించవచ్చని అన్నారు తిరుమల క్షేత్ర విశిష్టతను ప్రతిబింబించే ప్రత్యేక కవర్ల విడుదల ఒక అభినందనీయమైన కార్యక్రమాన్ని పేర్కొన్నారు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ జపాలు తీర్థం ప్రత్యేక కపాల కవర్ కు స్పాన్సర్ గా వ్యవహరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖ అందిస్తున్న సేవలను ప్రజలు మరింతగా వినియోగించుకోవాలని ముఖ్యంగా చిన్నారులు, యువత, ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ధైర్యంగా అధికమించి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు పోస్ట్మాస్టర్ జనరల్ కర్నూల్ రీజియన్ డాక్టర్ వెన్నెల ఉపేంద్ర మాట్లాడుతూ ఫిలాటెలీ ద్వారా దేశ చరిత్ర , సంస్కృతి, కళలు మరియు వారసత్వం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని విద్యార్థులు తపాల బిళ్ళల సేకరణ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్ కర్నూల్ రీజియన్ డాక్టర్ సుధాకర్ భార్య మాట్లాడుతూ తపాలా శాఖ కాలానుగుణంగా ఆధునిక సేవలను అందిస్తూ ప్రజలకు మరింత చేరువవుతుందని పేర్కొన్నారు తిరుపెక్స్-2026 వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో యువతలో ఫిలాటెలీ పట్ల పెంపొందించడంతోపాటు కపాల శాఖ చారిత్రక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు ఈ ప్రత్యేక కవర్లు తిరుమల క్షేత్రంలోని ఆధ్యాత్మిక, చారిత్రాత్మక, సాంస్కృతిక వైభవాన్ని తపాల జ్ఞాపకాల రూపంలో చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు తిరుపెక్స్-2026 లో భాగంగా విద్యార్థుల కోసం ఫిలాటిలి పై అవగాహన వర్క్ షాప్ ను మరియు లేఖా రచన పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు రెండు రోజులు పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన మూడో తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు ప్రజలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరు పెక్స్-2026 ను విజయవంతం చేయాలని తిరుపతి డివిజన్ సీనియర్ సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ మేజర్ సైదా తన్వీర్ కోరారు



