Wednesday, 2 September 2026
  • Home  
  • *గరుడ సేవ, వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు*
- తిరుపతి

*గరుడ సేవ, వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు*

*డీజేలు, మద్యం సేవించి డ్రైవింగ్‌ పై కఠిన చర్యలు* *24/7 పర్యవేక్షణతో వినాయక సాగర్ వద్ద భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు* *వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పై జిల్లా ఎస్ పి, నగరపాలక సంస్థ కమిషనర్ సమీక్ష* *వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలి* *TTD, పోలీస్, మునిసిపల్ శాఖల సమన్వయంతో వినాయక చవితి ఏర్పాట్లు* *నిమజ్జన శోభాయాత్రల్లో భద్రతకు పెద్దపీట : తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ* *తిరుపతి, సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి వినాయక చవితి వేడుకలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒకే సమయంలో రానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పండుగను వైభవంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా ఎస్ పి ఎల్. సుబ్బారాయుడు ఆదేశించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాల నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్ల పై స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణతో కలసి జిల్లా ఎస్పి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ శారదా దేవి, డిప్యూటీ కమీషనర్ అమరయ్య, ఏఎస్పీ రవి మనోహరాచారి, తుడా సెక్రటరీ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్ రవీంద్ర, టిటిడి ఎస్ ఈ ప్రసాద్, డిప్యూటీ ఈఓ భాస్కర్, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, డిసిపీ దేవి కుమారి, డి ఎం అండ్ హెచ్ ఓ నాయక్, అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు, ఫైర్, విద్యుత్, ఫిషరీస్, ఆర్టీసీ, డిఎస్పీ లు, నిమజ్జన కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు ఆర్.సి.మునికృష్ణ, మాంగాటి గోపాల్ రెడ్డి, గుండాల గోపి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి వేడుకలు ఒకే సమయంలో రానున్నందున తిరుపతిలో పండుగలు, నిమజ్జనం మరియు గరుడ సేవ ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, ఉత్సవ కమిటీలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ (సెప్టెంబర్ 18, 19 తేదీలు) దృష్ట్యా తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వినాయక నిమజ్జనాలను ప్రధానంగా 3వ రోజు లేదా 7వ రోజు తర్వాత పూర్తి చేసుకునేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలన్నారు. వినాయక మండపాల ఏర్పాటు కోసం సింగిల్ విండో పద్ధతి ద్వారా ముందస్తు అనుమతులు పొందాలన్నారు. మండప నిర్వాహకులు రాత్రివేళల్లో రక్షణ, విద్యుత్ దీపాలు, లైటింగ్ మరియు అగ్నిమాపక భద్రత చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వినాయక సాగర్ వద్ద పటిష్టమైన బారికేడింగ్, 3 నుండి 4 భారీ క్రేన్లు, నిరంతర విద్యుత్/లైటింగ్, 24/7 పర్యవేక్షణ కోసం శిక్షణ పొందిన ఈతగాళ్ళు (స్విమ్మర్లు), మరియు 2 అత్యవసర ఆంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్ర సమయంలో డిజేలు ప్రదర్శించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం లేదా అశాంతి సృష్టించడం వంటివి చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. శోభాయాత్రల నిర్వహణపై సమగ్ర మార్గదర్శకాలు ఇచ్చేందుకు సెప్టెంబర్ 12న ఉత్సవ కమిటీ నిర్వాహకులు, పోలీస్, మునిసిపల్, టిడిడి మరియు విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ మాట్లాడుతూ నగరంలో వినాయక చవితి వేడుకలను వైభవంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మునిసిపల్ కార్పొరేషన్, పోలీస్, TTD, ఇతర శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మునిసిపల్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనాలకు సంబంధించి సెప్టెంబర్ 14, 16, 20 తేదీలకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసి, రద్దీకి తగ్గట్టుగా పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్రల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చెట్ల కొమ్మలు అడ్డు తొలగించే చర్యలు చేపట్టాలని, టోయింగ్ వాహనాలు అందుబాటులో ఉంచాలని, అశ్లీల నృత్యాలు, నిమజ్జన సమయంలో టపాకాయలు వినియోగాన్ని నిషేధించాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులకు ప్రత్యేక భద్రత కల్పించాలని ఆదేశించారు. వినాయక సాగర్ వద్ద TTD ఆధ్వర్యంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, విగ్రహాల నిమజ్జనానికి తెప్పలు, అలంకరణలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు పసుపు, కుంకుమ, కంకణాలు, పుస్తక ప్రసాదం, శ్రీవారి ప్రసాదాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు సెప్టెంబర్ 11 నాటికి పూర్తి చేయాలని తెలిపారు. వినాయక సాగర్ వద్ద అన్నమాచార్య కళాబృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, కోలాటాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వేడుకల నిబంధనలు, భద్రతా ఏర్పాట్లపై నిర్వాహకులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. నిమజ్జన కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ టీటీడీ వారు పుస్తక ప్రసాదాలు, కంకణం వద్ద ఇస్తే అన్ని మండపాల నిర్వాహకులకు ఇస్తామని నిమార్జన కమిటీ వారు తెలిపారు. విద్యార్థుల చేత పార్వతిపుత్ర – పర్యావరణం కార్యక్రమం ద్వారా మట్టి విగ్రహాలను తయారు చేయించి పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. *డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి*

*డీజేలు, మద్యం సేవించి డ్రైవింగ్‌ పై కఠిన చర్యలు*
*24/7 పర్యవేక్షణతో వినాయక సాగర్ వద్ద భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు*
*వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పై జిల్లా ఎస్ పి, నగరపాలక సంస్థ కమిషనర్ సమీక్ష*

*వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలి*

*TTD, పోలీస్, మునిసిపల్ శాఖల సమన్వయంతో వినాయక చవితి ఏర్పాట్లు*

*నిమజ్జన శోభాయాత్రల్లో భద్రతకు పెద్దపీట : తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ*

*తిరుపతి, సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి

వినాయక చవితి వేడుకలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒకే సమయంలో రానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పండుగను వైభవంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా ఎస్ పి ఎల్. సుబ్బారాయుడు ఆదేశించారు.

వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాల నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్ల పై స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణతో కలసి జిల్లా ఎస్పి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ శారదా దేవి, డిప్యూటీ కమీషనర్ అమరయ్య, ఏఎస్పీ రవి మనోహరాచారి, తుడా సెక్రటరీ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్ రవీంద్ర, టిటిడి ఎస్ ఈ ప్రసాద్, డిప్యూటీ ఈఓ భాస్కర్, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, డిసిపీ దేవి కుమారి, డి ఎం అండ్ హెచ్ ఓ నాయక్, అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు, ఫైర్, విద్యుత్, ఫిషరీస్, ఆర్టీసీ, డిఎస్పీ లు, నిమజ్జన కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు ఆర్.సి.మునికృష్ణ, మాంగాటి గోపాల్ రెడ్డి, గుండాల గోపి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి వేడుకలు ఒకే సమయంలో రానున్నందున తిరుపతిలో పండుగలు, నిమజ్జనం మరియు గరుడ సేవ ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, ఉత్సవ కమిటీలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ (సెప్టెంబర్ 18, 19 తేదీలు) దృష్ట్యా తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వినాయక నిమజ్జనాలను ప్రధానంగా 3వ రోజు లేదా 7వ రోజు తర్వాత పూర్తి చేసుకునేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలన్నారు. వినాయక మండపాల ఏర్పాటు కోసం సింగిల్ విండో పద్ధతి ద్వారా ముందస్తు అనుమతులు పొందాలన్నారు. మండప నిర్వాహకులు రాత్రివేళల్లో రక్షణ, విద్యుత్ దీపాలు, లైటింగ్ మరియు అగ్నిమాపక భద్రత చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వినాయక సాగర్ వద్ద పటిష్టమైన బారికేడింగ్, 3 నుండి 4 భారీ క్రేన్లు, నిరంతర విద్యుత్/లైటింగ్, 24/7 పర్యవేక్షణ కోసం శిక్షణ పొందిన ఈతగాళ్ళు (స్విమ్మర్లు), మరియు 2 అత్యవసర ఆంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్ర సమయంలో డిజేలు ప్రదర్శించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం లేదా అశాంతి సృష్టించడం వంటివి చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. శోభాయాత్రల నిర్వహణపై సమగ్ర మార్గదర్శకాలు ఇచ్చేందుకు సెప్టెంబర్ 12న ఉత్సవ కమిటీ నిర్వాహకులు, పోలీస్, మునిసిపల్, టిడిడి మరియు విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.

తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ మాట్లాడుతూ నగరంలో వినాయక చవితి వేడుకలను వైభవంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మునిసిపల్ కార్పొరేషన్, పోలీస్, TTD, ఇతర శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మునిసిపల్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనాలకు సంబంధించి సెప్టెంబర్ 14, 16, 20 తేదీలకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసి, రద్దీకి తగ్గట్టుగా పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్రల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చెట్ల కొమ్మలు అడ్డు తొలగించే చర్యలు చేపట్టాలని, టోయింగ్ వాహనాలు అందుబాటులో ఉంచాలని, అశ్లీల నృత్యాలు, నిమజ్జన సమయంలో టపాకాయలు వినియోగాన్ని నిషేధించాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులకు ప్రత్యేక భద్రత కల్పించాలని ఆదేశించారు. వినాయక సాగర్ వద్ద TTD ఆధ్వర్యంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, విగ్రహాల నిమజ్జనానికి తెప్పలు, అలంకరణలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు పసుపు, కుంకుమ, కంకణాలు, పుస్తక ప్రసాదం, శ్రీవారి ప్రసాదాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు సెప్టెంబర్ 11 నాటికి పూర్తి చేయాలని తెలిపారు. వినాయక సాగర్ వద్ద అన్నమాచార్య కళాబృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, కోలాటాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వేడుకల నిబంధనలు, భద్రతా ఏర్పాట్లపై నిర్వాహకులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.

నిమజ్జన కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ టీటీడీ వారు పుస్తక ప్రసాదాలు, కంకణం వద్ద ఇస్తే అన్ని మండపాల నిర్వాహకులకు ఇస్తామని నిమార్జన కమిటీ వారు తెలిపారు. విద్యార్థుల చేత పార్వతిపుత్ర – పర్యావరణం కార్యక్రమం ద్వారా మట్టి విగ్రహాలను తయారు చేయించి పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

*డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.