Thursday, 3 September 2026
  • Home  
  • గోదావరి కరకట్ట వద్ద పుష్కర ఘాట్లకు శంకుస్థాపన
- BHADRADRI

గోదావరి కరకట్ట వద్ద పుష్కర ఘాట్లకు శంకుస్థాపన

భద్రాచలం, ఆగస్టు 29: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని గోదావరి కరకట్ట ప్రాంతంలో సుమారు రూ.46 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పుష్కర ఘాట్లకు శనివారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న పనులకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రాచలం రామాలయం, గోదావరి కరకట్ట అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్‌లో భద్రాచలానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. రామాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ, ఆలయ ఈఓ దామోదర్, పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్, సర్పంచ్ పూనెం కృష్ణ, పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం, ఆగస్టు 29: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని గోదావరి కరకట్ట ప్రాంతంలో సుమారు రూ.46 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పుష్కర ఘాట్లకు శనివారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న పనులకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రాచలం రామాలయం, గోదావరి కరకట్ట అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్‌లో భద్రాచలానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
రామాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ, ఆలయ ఈఓ దామోదర్, పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్, సర్పంచ్ పూనెం కృష్ణ, పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.