నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన పులమోని కృష్ణ (38) అనే వ్యక్తి వల చుట్టుకోవడంతో నీటిలో చిక్కుకుని మునిగి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.



