రాంనగర్ కాలనీ రామాలయంలో వారాహి దేవి నవరాత్రి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు వరదరాజన్ అయ్యంగార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూజల్లో పాల్గొనే భక్తులకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు. భక్తులతో సామూహిక కుంకుమార్చనలు, అభిషేక పూజలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం వరకు రాత్రి 7 గంటల నుండి ఈ పూజలు జరుగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాస ఆచార్యులు, కరుణశ్రీ, మహిళలు పాల్గొన్నారు.




