అనంతసాగరం ఆగష్టు 29,పున్నమి ప్రతినిధి:
అనంతసాగరం బస్టాండ్ సెంటర్ లో వెలసివున్న శ్రీ హజ్రత్ సయ్యద్ షా మష్కూర్ అలీ షా ఖాద్రి 16వ ఉరుసు గంధమహోత్సవం సెప్టెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని దర్గా పీఠాధిపతి సయ్యద్ సాని సాహెబ్, సయ్యద్ మజీద్ సాహెబ్ లు తెలిపారు. నాలుగు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగే ఈ ఉరుసు మహోత్సవానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఆహ్వానం పలుకుతూ వారి చేత వాల్ పోస్టర్లను విడుదల చేశారు.. వీరి వెంట గ్రామ ముస్లిం మత పెద్దలు, దర్గా శిష్య బృందం పాల్గొన్నారు.


