ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా తాజునోతు భద్రంను పార్టీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. పార్టీ బలోపేతం, గిరిజన వర్గాల సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా తాజునోతు భద్రం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడంతో పాటు గిరిజన హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


