Thursday, 24 September 2026
  • Home  
  • గణిత ఉపాధ్యాయుడు గిడుతూరి రవికుమార్ మృతి ఉపాధ్యాయ లోకంలో విషాదం.. ఏపీటీఎఫ్ నేతల సంతాపం
- తూర్పు గోదావరి

గణిత ఉపాధ్యాయుడు గిడుతూరి రవికుమార్ మృతి ఉపాధ్యాయ లోకంలో విషాదం.. ఏపీటీఎఫ్ నేతల సంతాపం

తాళ్లపూడి, జూన్ 23 (పున్నమి ప్రతినిధి): తాళ్లపూడి మండలం గజ్జరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (గణితం)గా విధులు నిర్వహిస్తున్న గిడుతూరి రవికుమార్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ నెల 15వ తేదీ ఉదయం ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఆయనకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనంపై నుంచి కిందపడిపోయారు. వెంటనే స్థానికులు తాళ్లపూడిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ మరోసారి ఫిట్స్ రావడంతో మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు ఆయనకు మెదడుకు రెండు శస్త్రచికిత్సలు నిర్వహించినప్పటికీ కోమాలోకి వెళ్లిన రవికుమార్, చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. రవికుమార్ మృతిపట్ల ఏపీటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు దున్నా దుర్గారావు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా దున్నా దుర్గారావు మాట్లాడుతూ, ఇంకా ఎంతో సేవాకాలం మిగిలి ఉండగానే రవికుమార్ అకాల మరణం చెందడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

తాళ్లపూడి, జూన్ 23 (పున్నమి ప్రతినిధి):
తాళ్లపూడి మండలం గజ్జరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (గణితం)గా విధులు నిర్వహిస్తున్న గిడుతూరి రవికుమార్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు.
ఈ నెల 15వ తేదీ ఉదయం ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఆయనకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనంపై నుంచి కిందపడిపోయారు. వెంటనే స్థానికులు తాళ్లపూడిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ మరోసారి ఫిట్స్ రావడంతో మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు ఆయనకు మెదడుకు రెండు శస్త్రచికిత్సలు నిర్వహించినప్పటికీ కోమాలోకి వెళ్లిన రవికుమార్, చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
రవికుమార్ మృతిపట్ల ఏపీటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు దున్నా దుర్గారావు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా దున్నా దుర్గారావు మాట్లాడుతూ, ఇంకా ఎంతో సేవాకాలం మిగిలి ఉండగానే రవికుమార్ అకాల మరణం చెందడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.