నందలూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నందలూరు బస్టాండ్ ఆవరణలో జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి అభిమానులు, జనసైనికులు సంబరాలు జరుపుకున్నారు.
పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కొట్టే శ్రీహరి ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమానులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


