Thursday, 3 September 2026
  • Home  
  • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష*
- తిరుపతి

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష*

*రూ 12,500 జరిమానా విధించిన నాయుడుపేట కోర్టు* నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లం జంక్షన్ సమీపంలో మద్యం సేవించి,అతివేగంగా,నిర్లక్ష్యంగా కంటైనర్ లారీ నడిపి ప్రజల ప్రాణాలకు,భద్రతకు ప్రమాదం కలిగించిన తమిళనాడు ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ తియగ రాజన్ పై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.కేసును విచారించిన నాయుడుపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పి. మీనాక్షి సుందరి నిందితుడికి 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించినట్లు నాయుడుపేట పట్టణ సీఐ వెంకటేశ్వర్లు,ఎస్సై ఎం.శివ శంకరరావు లు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట పట్టణ సీఐ వెంకటేశ్వర్లు,ఎస్ఐ ఎం. శివశంకరరావు లు మాట్లాడుతూ వాహన చోధకులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడిపినా,ట్రాఫిక్ నిబంధనలు పాటించుకున్నా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.వాహన సాధకులు వాహనం నడిపేటప్పుడు తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా వాహనాన్ని నడపాలని సూచించారు. అతివేగంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

*రూ 12,500 జరిమానా విధించిన నాయుడుపేట కోర్టు*

నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లం జంక్షన్ సమీపంలో మద్యం సేవించి,అతివేగంగా,నిర్లక్ష్యంగా కంటైనర్ లారీ నడిపి ప్రజల ప్రాణాలకు,భద్రతకు ప్రమాదం కలిగించిన తమిళనాడు ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ తియగ రాజన్ పై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.కేసును విచారించిన నాయుడుపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పి. మీనాక్షి సుందరి నిందితుడికి 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించినట్లు నాయుడుపేట పట్టణ సీఐ వెంకటేశ్వర్లు,ఎస్సై ఎం.శివ శంకరరావు లు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట పట్టణ సీఐ వెంకటేశ్వర్లు,ఎస్ఐ ఎం. శివశంకరరావు లు మాట్లాడుతూ వాహన చోధకులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడిపినా,ట్రాఫిక్ నిబంధనలు పాటించుకున్నా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.వాహన సాధకులు వాహనం నడిపేటప్పుడు తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా వాహనాన్ని నడపాలని సూచించారు. అతివేగంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.