Saturday, 5 September 2026
  • Home  
  • కాకాణికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన యాదవ నేతలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకాణికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన యాదవ నేతలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 4 ( పున్నమి ప్రతినిధి) నెల్లూరు: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పలువురు యాదవ నేతలు నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ, యాదవ నేతలు, ప్రజలందరూ శ్రీకృష్ణుడి కృపాకటాక్షాలతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణుడి బోధనలు, భగవద్గీతలోని ధర్మం, కర్తవ్యం, బాధ్యతల సందేశాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ప్రజలందరిపై శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 4 ( పున్నమి ప్రతినిధి)
నెల్లూరు: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పలువురు యాదవ నేతలు నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ, యాదవ నేతలు, ప్రజలందరూ శ్రీకృష్ణుడి కృపాకటాక్షాలతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణుడి బోధనలు, భగవద్గీతలోని ధర్మం, కర్తవ్యం, బాధ్యతల సందేశాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ప్రజలందరిపై శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.