Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మంచిర్యాల

కాంగ్రెస్ పాలనలో అవినీతిమయమైన తెలంగాణ రాష్ట్రం-హరీష్ రావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంగ్రెస్ పాలనలో అవినీతిమయమైన తెలంగాణ రాష్ట్రం-హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ పెంపుపై హామీ ఇచ్చి వృద్ధులు, వితంతువులను మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి జాతీయ రహదారిపై వంటవార్పు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే చిన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో భూకబ్జాలు, కుంభకోణాలు, లూటీలు పెరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి శూన్యంగా మారి, అవినీతి మాత్రం ఘనంగా ఉందన్నారు. పూర్తిగా రాష్ట్రం అవినీతి మయమైంది అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కమిషన్ల చుట్టూ రాజకీయ నడుస్తుందని కమిషన్లు రాని పథకాలను అమలు చేయకుండా కమిషన్లు వచ్చే పథకాలను మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 33 నెలలలో ఒక్క నూతన పెన్షన్ ఇవ్వకపోగా మూడున్నర లక్షల పింఛన్లను తొలగించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ది అన్నారు. తన గురువు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గెలిచిన కొన్ని నెలల్లోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుండగా శిష్యుడు మాత్రం ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు..
రాష్ట్రంలోని ప్రతి పెన్షన్ దారునికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.66,000 బాకీపడిందని తెలిపారు. కాంగ్రెస్ అవినీతి పాలన అసమర్థ పాలనపై ప్రజలు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారెంటీలు 1000 రోజులైనా అమలు కాలేదని ఏద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంవత్సరానికి రెండు లక్షల 60,000 పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి అందిస్తే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 86,000 పెళ్లిలకు మాత్రమే కళ్యాణ లక్ష్మి అందిస్తూ కళ్యాణ లక్ష్మి లో కోత విధిస్తుందని అన్నారు. బెల్లంపల్లిలో టిఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా పోరాడుతున్నారని అన్నారు దానికి నిదర్శనమే గత బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన సీట్లు అని తెలిపారు నైతికంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, సీనియర్ నాయకులు , మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ . ప్రవీణ్ కుమార్ లు ఉన్నారు. ముందుగా బెల్లంపల్లికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ బీ ఆర్ ఎస్ నాయకులు గజమాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బెల్లంపల్లిస్థానిక కౌన్సిలర్ దుంగల రాజ్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ టి. సత్యనారాయణ, మాజీ ఎంపీపీలు సుభాష్ రావు, మసాడి శ్రీదేవి శ్రీరాములు, నాయకులు నూనేటి సత్యనారాయణ, సుందర్ రావు, సింగం గణేష్ గౌడ్, కొమ్మెర లక్ష్మణ్, నూనేటి సత్యనారాయణ, భీమిని మండల నాయకులు శ్రీరామారావు, కర్రె శంకర్ లతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, పలువురు కౌన్సిలర్లు, యూత్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు

కాంగ్రెస్ పాలనలో అవినీతిమయమైన తెలంగాణ రాష్ట్రం-హరీష్ రావు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *