Tuesday, 15 September 2026
  • Home  
  • ఎమ్మెల్యే వినోద్ పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం-సీనియర్ నాయకులు
- మంచిర్యాల

ఎమ్మెల్యే వినోద్ పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం-సీనియర్ నాయకులు

బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు మత్తమరి సూరిబాబు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వలసవాదులకు ప్రాముఖ్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే బ్రష్టు పట్టిస్తున్నాడని అన్నారు. ఎమ్మెల్యే వైఖరి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. డబ్బులు నా వారికి పదవులు కట్టబెట్టుతూ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కనీసం గుర్తించడం లేదని వాపోయారు. గత బిఆర్ఎస్ పాలనలో అనేక కేసులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో ఒక్క పైసా ఆశించకుండా ఎమ్మెల్యే వినోద్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు కనీసం విలువ లేకుండా పోయిందన్నారు..ఇప్పటికైనా ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకొని నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలను కలుపుకొని ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నాయకులను, కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానాలు కల్పించాలని అన్నారు. మళ్లీ బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎమ్మెల్యే వినోద్ అందరిని కలుపుకొని పనిచేయాలని, లేనిపక్షంలో ఎమ్మెల్యే వినోద్ వ్యవహార శైలిపై అధిష్టానంకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అబ్జల్, మునిమంద రమేష్ , నయీమ్ , రొడ్డ శ్యామ్, ఎండి గౌస్, జక్కుల శ్రీధర్, చిప్ప మనోహర్, మాజీ కౌన్సిలర్ బొడ్డు నారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్ కటకం సతీష్, సిలివేరి సత్యనారాయణ, సూరం బానేష్, మేకల శ్రీనివాస్ మత్తమారి సత్తిబాబు మంగమూర్తి దాసరి సంజీవ్ మతమారి జగన్ బైరి శ్రీనివాస్ మతమారి శ్రీనివాస్ రాజబ్రహ్మం గడ్డం అశోక్ కళ్యాణం పోషం అజీమ్ భాయ్ ఎండి రహీం హరీష్ పాండే బబ్లు భాయ్ ఆర్ఎం సింగ్ ఆడియో నక్క కృష్ణ రాజారత్నం చిన్న జీలకర్ర వాసు సబ్బని రాజనర్సు టిఎల్ చారి జంజరాల మనోహర్ కుమ్మరి శంకర్ జూపాక లక్ష్మీనారాయణ మల్లేష్ బాబురావు సోగాల రవి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు మత్తమరి సూరిబాబు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వలసవాదులకు ప్రాముఖ్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే బ్రష్టు పట్టిస్తున్నాడని అన్నారు. ఎమ్మెల్యే వైఖరి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. డబ్బులు నా వారికి పదవులు కట్టబెట్టుతూ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కనీసం గుర్తించడం లేదని వాపోయారు. గత బిఆర్ఎస్ పాలనలో అనేక కేసులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో ఒక్క పైసా ఆశించకుండా ఎమ్మెల్యే వినోద్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు కనీసం విలువ లేకుండా పోయిందన్నారు..ఇప్పటికైనా ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకొని నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలను కలుపుకొని ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నాయకులను, కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానాలు కల్పించాలని అన్నారు. మళ్లీ బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎమ్మెల్యే వినోద్ అందరిని కలుపుకొని పనిచేయాలని, లేనిపక్షంలో ఎమ్మెల్యే వినోద్ వ్యవహార శైలిపై అధిష్టానంకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అబ్జల్, మునిమంద రమేష్ , నయీమ్ , రొడ్డ శ్యామ్, ఎండి గౌస్, జక్కుల శ్రీధర్, చిప్ప మనోహర్, మాజీ కౌన్సిలర్ బొడ్డు నారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్ కటకం సతీష్, సిలివేరి సత్యనారాయణ, సూరం బానేష్, మేకల శ్రీనివాస్ మత్తమారి సత్తిబాబు మంగమూర్తి దాసరి సంజీవ్ మతమారి జగన్ బైరి శ్రీనివాస్ మతమారి శ్రీనివాస్ రాజబ్రహ్మం గడ్డం అశోక్ కళ్యాణం పోషం అజీమ్ భాయ్ ఎండి రహీం హరీష్ పాండే బబ్లు భాయ్ ఆర్ఎం సింగ్ ఆడియో నక్క కృష్ణ రాజారత్నం చిన్న జీలకర్ర వాసు సబ్బని రాజనర్సు టిఎల్ చారి జంజరాల మనోహర్ కుమ్మరి శంకర్ జూపాక లక్ష్మీనారాయణ మల్లేష్ బాబురావు సోగాల రవి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.