సత్యవేడు:
👉 వినాయక చవితి సందర్భంగా ప్రజలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించాలని సత్యవేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ లావణ్య సూచించారు.
👉 వినాయక విగ్రహాల ప్రతిష్ఠ, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్కు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సహకరించాలని కోరారు.
👉 ఊరేగింపుల సమయంలో అధిక శబ్దంతో DJలు వినియోగించడం, అనుమతి లేని కార్యక్రమాలు నిర్వహించడం, మద్యం సేవించడం, గొడవలకు పాల్పడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
👉 అదేవిధంగా సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ లావణ్య సూచించారు. విరాళాల పేరుతో వచ్చే అనుమానాస్పద QR కోడ్లు, UPI లింకులు , ఫోన్ కాల్స్, మెసేజ్లను నమ్మవద్దని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోవద్దన్నారు.
👉 సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు , అభ్యంతరకర పోస్టులు , మత విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలను ప్రచారం చేయరాదని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం అందించి, సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని తెలిపారు.
👉 ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, ఎలక్ట్రికల్ తదితర శాఖల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్ఐ లావణ్య వెల్లడించారు.


