Sunday, 6 September 2026
  • Home  
  • మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు..! అభిమానులకు రూ.5 లక్షల బీమా కానుక..!!
- అనకాపల్లి

మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు..! అభిమానులకు రూ.5 లక్షల బీమా కానుక..!!

అనకాపల్లి జిల్లా :(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఎలమంచిలి నియోజకవర్గంలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా సేవా కార్యక్రమాలు ఎలమంచిలి: మెగాస్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యువత సీనియర్ అభిమానులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీని పుట్టినరోజు కానుకగా అందజేశారు. ఈ బీమా పాలసీని గల్లా కొండలరావు ద్వారా ద్వారపురెడ్డి నాగేశ్వరరావు అందజేశారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా ఎలమంచిలి నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అభిమానులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సుమారు 1,500 మామిడి, జామ, కొబ్బరి తదితర మొక్కలను నాటారు. రాష్ట్రంలో చిరంజీవి జన్మదినం సందర్భంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాల్లో ఎలమంచిలి నియోజకవర్గంలో అత్యధికంగా మొక్కలు నాటడం విశేషంగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణతో పాటు అభిమానుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ జే. ఏ. సి, ప్రతినిధులు తెలిపారు. చిరంజీవి అభిమానులు చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

అనకాపల్లి జిల్లా :(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )

ఎలమంచిలి నియోజకవర్గంలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా సేవా కార్యక్రమాలు

ఎలమంచిలి: మెగాస్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యువత సీనియర్ అభిమానులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీని పుట్టినరోజు కానుకగా అందజేశారు. ఈ బీమా పాలసీని గల్లా కొండలరావు ద్వారా ద్వారపురెడ్డి నాగేశ్వరరావు అందజేశారు.
చిరంజీవి జన్మదినం సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా ఎలమంచిలి నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అభిమానులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సుమారు 1,500 మామిడి, జామ, కొబ్బరి తదితర మొక్కలను నాటారు.
రాష్ట్రంలో చిరంజీవి జన్మదినం సందర్భంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాల్లో ఎలమంచిలి నియోజకవర్గంలో అత్యధికంగా మొక్కలు నాటడం విశేషంగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణతో పాటు అభిమానుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ జే. ఏ. సి, ప్రతినిధులు తెలిపారు.
చిరంజీవి అభిమానులు చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.