రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 6 (పున్నమి ప్రతినిధి)
ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి–వెంకట్రావుపల్లె గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో పల్లెప్రగతి పడకేయడం, తాగునీటి సమస్యలు, పారిశుధ్య లోపాలు, వీధిదీపాల సమస్యలు, నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ ఎండ్ర చందన్, సర్పంచ్ రడం లక్ష్మి, ఉపసర్పంచ్ ఓర్పుల లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, సీనియర్, యువజన నాయకులు పాల్గొన్నారు.

