కొండపల్లిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు విస్తృత పర్యటన.
రూ.1.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, సెప్టెంబర్ 2, 2026:
కొండపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.
ఈ మేరకు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వెస్ట్ ఇబ్రహీంపట్నంలో మసీదు ఆవరణలో జండా చెట్టు వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద గంగానమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొన్నారు.
మొత్తం రూ.1.35 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో భాగంగా పలు ప్రాంతాల్లో రహదారులు, తాగునీటి పైప్‌లైన్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనులను ప్రారంభించారు.
ఇబ్రహీంపట్నం భీమరాజుగుట్టలోని ఆర్టీసీ డిపో వెనుక భాగంలో ఉన్న పులగుంట ప్రాంతంలో రూ.27 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా ఇబ్రహీంపట్నం పరిధిలోని వినాయకస్వామి గుడి ప్రాంతంలో రూ.28 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించనున్న తారు రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెస్ట్ ఇబ్రహీంపట్నంలో రూ.40 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి పైప్‌లైన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
తూర్పు ఇబ్రహీంపట్నంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వరకు రూ.20 లక్షల సీఆర్‌డీఏ నిధులతో నిర్మించిన సీసీ డ్రెయిన్‌ను ప్రారంభించారు. అలాగే 13వ వార్డులో రూ.20 లక్షల సీఆర్‌డీఏ నిధులతో నిర్మించిన సీసీ డ్రెయిన్‌ను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించి మరిన్ని పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు.
స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు



