రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి)
సిరిసిల్ల: ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్యాడీ బకాయిలను చెల్లించకుండానే రైస్ మిల్లులోని మిషనరీని లారీలో లోడ్ చేసి తరలించేందుకు సిద్ధమవుతున్న మహేశ్వరి రైస్ మిల్లును జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. మిల్లుపై ప్రభుత్వానికి సుమారు రూ.1.27 కోట్ల బకాయిలు ఉన్నట్లు డీఎస్ఓ బుచ్చిబాబు తెలిపారు.
మిషనరీని తరలిస్తున్న విషయం గురించి మీడియా ప్రతినిధులు డీఎస్ఓకు సమాచారం అందించడంతో ఆయన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం మహేశ్వరి రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు.

ప్యాడి బకాయిలు చెల్లించకుండానే మిషనరీ తరలింపు రైస్ మిల్ సీజ్
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి) సిరిసిల్ల: ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్యాడీ బకాయిలను చెల్లించకుండానే రైస్ మిల్లులోని మిషనరీని లారీలో లోడ్ చేసి తరలించేందుకు సిద్ధమవుతున్న మహేశ్వరి రైస్ మిల్లును జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. మిల్లుపై ప్రభుత్వానికి సుమారు రూ.1.27 కోట్ల బకాయిలు ఉన్నట్లు డీఎస్ఓ బుచ్చిబాబు తెలిపారు. మిషనరీని తరలిస్తున్న విషయం గురించి మీడియా ప్రతినిధులు డీఎస్ఓకు సమాచారం అందించడంతో ఆయన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం మహేశ్వరి రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు.

