Wednesday, 2 September 2026
  • Home  
  • ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ మండల కమిటీలు ఏర్పాటు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ మండల కమిటీలు ఏర్పాటు

పున్నమి ప్రతినిధి వరికుంటపాడు ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ మండల కమిటీలను బుధవారం వరికుంటపాడు పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ జిల్లా ఇన్‌చార్జీలు మంద వెంకటేశ్వరరావు మాదిగ, పందిటి అంబేడ్కర్‌ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాతిపూడి డేవిడ్‌ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన నూతన కమిటీలు భాగంగా ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడిగా కాకి ప్రశాంత్‌ మాదిగ, అధికార ప్రతినిధిగా కొండిపోగు రాజు మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడిగా యడవల్లి చిట్టిబాబు మాదిగ, అధికార ప్రతినిధిగా ఉన్నిమద్దల చిన్న మాదిగలను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనలో మందకృష్ణ మాదిగ చేసిన కృషిని నాయకులు కొనియాడారు. భవిష్యత్‌లో రాజ్యాధికార లక్ష్య సాధనకు మాదిగలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 9న వరంగల్‌లో జరగనున్న ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ అనుబంధ సంఘాల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరి రవితేజ, కాకి అంకయ్య, తాతిపూడి మోసే, కొండిపోగు ప్రసాద్‌, గుంటఘాని రాజశేఖర్‌, కాకి హరినారాయణతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి వరికుంటపాడు
ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ మండల కమిటీలను బుధవారం వరికుంటపాడు పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ జిల్లా ఇన్‌చార్జీలు మంద వెంకటేశ్వరరావు మాదిగ, పందిటి అంబేడ్కర్‌ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాతిపూడి డేవిడ్‌ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన నూతన కమిటీలు భాగంగా ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడిగా కాకి ప్రశాంత్‌ మాదిగ, అధికార ప్రతినిధిగా కొండిపోగు రాజు మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడిగా యడవల్లి చిట్టిబాబు మాదిగ, అధికార ప్రతినిధిగా ఉన్నిమద్దల చిన్న మాదిగలను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనలో మందకృష్ణ మాదిగ చేసిన కృషిని నాయకులు కొనియాడారు. భవిష్యత్‌లో రాజ్యాధికార లక్ష్య సాధనకు మాదిగలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 9న వరంగల్‌లో జరగనున్న ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ అనుబంధ సంఘాల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరి రవితేజ, కాకి అంకయ్య, తాతిపూడి మోసే, కొండిపోగు ప్రసాద్‌, గుంటఘాని రాజశేఖర్‌, కాకి హరినారాయణతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.