Wednesday, 2 September 2026
  • Home  
  • జనహృదయాల్లో చిరంజీవి వైఎస్సార్‌..!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనహృదయాల్లో చిరంజీవి వైఎస్సార్‌..!

మహానేత 17వ వర్ధంతికి ఘన నివాళులు – రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ ఆత్మకూరు, సెప్టెంబర్‌ 2 (పున్నమి ప్రతినిధి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జనహృదయ నేతగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్‌ 17వ వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మకూరులో బుధవారం ఘనంగా నివాళులర్పించారు.ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచనల మేరకు పట్టణంలోని ఎంజీఆర్‌ మున్సిపల్‌ బస్టాండ్‌ ప్రాంగణంలో వైఎస్సార్‌ విగ్రహానికి భారీ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సీహెచ్‌ ఆదిశేషయ్య, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగలపాటి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ పేదలు, రైతులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. అనంతరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీవాణి చేతుల మీదుగా రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పీఆర్‌ విభాగం అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ నాయకుడు తోడేటి అశోక్, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, షేక్‌ రహీం, మీరా మొహిద్దీన్‌తో పాటు మహిళా నాయకులు షేక్‌ పర్వీన్‌, కల్పనారెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

మహానేత 17వ వర్ధంతికి ఘన నివాళులు – రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

ఆత్మకూరు, సెప్టెంబర్‌ 2 (పున్నమి ప్రతినిధి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జనహృదయ నేతగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్‌ 17వ వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మకూరులో బుధవారం ఘనంగా నివాళులర్పించారు.ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచనల మేరకు పట్టణంలోని ఎంజీఆర్‌ మున్సిపల్‌ బస్టాండ్‌ ప్రాంగణంలో వైఎస్సార్‌ విగ్రహానికి భారీ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సీహెచ్‌ ఆదిశేషయ్య, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగలపాటి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ పేదలు, రైతులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు.
అనంతరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీవాణి చేతుల మీదుగా రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పీఆర్‌ విభాగం అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ నాయకుడు తోడేటి అశోక్, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, షేక్‌ రహీం, మీరా మొహిద్దీన్‌తో పాటు మహిళా నాయకులు షేక్‌ పర్వీన్‌, కల్పనారెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.