Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంగన్వాడి కేంద్రాలు సరస్వతీ నిలయాలుగా ఉండాలి – AMO జి. సుధీర్‌బాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

కలిగిరి, పున్నమి ప్రతినిధి , ఆగస్టు 22, 2026:
కలిగిరి మండలంలోని పి.ఎం.శ్రీ మోడల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న నాలుగో రోజు FLN – జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా A.M.O జి. సుధీర్‌బాబు సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఆయన విలువైన సూచనలు, సందేశాన్ని అందించారు.అంగన్వాడీ కేంద్రాలు కేవలం పిల్లలకు విద్యను అందించే ప్రదేశాలు మాత్రమే కాకుండా సరస్వతీ నిలయాలుగా ఉండాలని AMO జి. సుధీర్‌బాబు అన్నారు. చిన్నారులు తల్లి తర్వాత ఎక్కువ సమయం అంగన్వాడీ కేంద్రాల్లోనే గడుపుతారని, వారి ప్రారంభ దశలోనే విద్యతో పాటు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, పరిశుభ్రత వంటి విలువలను నేర్పిస్తే భవిష్యత్తులో వారు మంచి భావి భారత పౌరులుగా ఎదుగుతారని తెలిపారు.ప్రారంభ బాల్య విద్యలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని, FLN కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో పఠనం, లెక్కలు, ఆలోచనా సామర్థ్యం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.ఇదిలా ఉండగా, 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కావలి డివిజన్‌లో ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా ఎంపికైన దూబగుంట అంగన్వాడీ కార్యకర్త శ్రీమతి దొరసానమ్మను AMO జి. సుధీర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సేవలను ప్రశంసిస్తూ, ఇతర కార్యకర్తలు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలిగిరి పి.ఎం.శ్రీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ అన్నవరపు శ్రీను, సూపర్‌వైజర్ శ్రీమతి విజయలక్ష్మి, DRPలు గాదిరెడ్డి మురళీకృష్ణ, లెక్కల శ్రీనివాసులు, దగుమాటి మీనా కుమార్‌రెడ్డి, కలిగిరి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రాలు సరస్వతీ నిలయాలుగా ఉండాలి – AMO జి. సుధీర్‌బాబు

అంగన్వాడి కేంద్రాలు సరస్వతీ నిలయాలుగా ఉండాలి – AMO జి. సుధీర్‌బాబు

అంగన్వాడి కేంద్రాలు సరస్వతీ నిలయాలుగా ఉండాలి – AMO జి. సుధీర్‌బాబు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *